Sitakka | కేటీఆర్ రాజీనామా చేయాలి

Sitakka | కేటీఆర్ రాజీనామా చేయాలి

Sitakka | హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ…. ఎస్‌హెచ్‌జీలకు రూ.57 వేల కోట్ల రుణాలిస్తే కేటీఆర్‌ రాజీనామా చేస్తానన్నారని తెలిపారు. ఈ రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ.57వేల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.

మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారాన్ని కూడా భరిస్తున్నామన్నారు. మహిళా సంఘాల రుణాలపై ఇప్పటివరకు రూ.1,390 కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో వడ్డీలు ఎగ్గొట్టారు, అభయహస్తం నిధులు కాజేశారన మంత్రి సీతక్క తెలిపారు.

Leave a Reply