Sitakka | శ్యామ్ రావును భారీ మెజారితో గెలిపించాలి

Sitakka | శ్యామ్ రావును భారీ మెజారితో గెలిపించాలి

మంత్రి సీతక్క

Sitakka | మల్లంపల్లి, ఆంధ్రప్రభ : మల్లంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్ రావు లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, గ్రామాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి గ్రామంలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తామని చెప్పి నూతనంగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసి, మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పేరు పెట్టామన్నారు.

అలాగే మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్ రావుని గెలిపించి మరింత గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులను మంత్రి సీతక్క (Minister Sitakka) కోరారు. స్థానికుడు అందరితో కలిసిమెలిసే గుణం కలిగిన వ్యక్తి శ్యామ్ రావును గెలిపిస్తే మల్లంపల్లి మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ (Committee Chairman) కొండం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు చందా రాము, డా.రవిబాబు, రామక్రిష్ణ రెడ్డి, చిట్టిరెడ్డి రాంరెడ్డి, ఎడ్ల కరుణాకర్ రెడ్డి, మూల గణేష్ రెడ్డి, మూల వెంకటేశ్వర్లు, నందికొండ శ్రీనివాస్ రెడ్డి, చెరుకుపల్లి మల్లారెడ్డి, మాచర్ల రవి, ముత్యాల వెంకన్న, కాగితోజు, దేవేంద్రాచారి, ఇటుకల, కర్ణాకర్, అహ్మద్ పాషా, గొల్న మొగిలివనమ వేణు, తాళ్ళపల్లి సాంబయ్య, కక్కెర్ల సాంబయ్య, గుడెపురాజిరెడ్డి, జనగాం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply