అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.195 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అతడి అక్రమ మైనింగ్ సహా భూకబ్జాలపై విచారణకు జి.వి.జి అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
AP : వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్
