మానవత్వం చాటుకున్న ఎస్సైలు
కరీంనగర్ – కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న తమ బ్యాచ్ సభ్యులు, హైదరాబాద్ పిసిఆర్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. వరప్రసాద్ కి అండగా ఎస్సైలు అండగా నిలిచారు. నేస్తమా మేమున్నాం అంటూ 2009 ఎస్సై బ్యాచ్ సంక్షేమ కమిటీ ఈరోజు గొప్ప మానవత్వాన్ని చాటుకుంది. తమ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా, ఇన్స్పెక్టర్ ఎం. వరప్రసాద్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5,14,000/- (ఐదు లక్షల పద్నాలుగు వేల రూపాయల) భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను బ్యాచ్ సభ్యులు స్వయంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అందజేశారు.
ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఇన్స్పెక్టర్ వరప్రసాద్ కి తమ బ్యాచ్ తరపున మద్దతు తెలియజేస్తూ, ఆయన త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఈ సందర్భంగా బ్యాచ్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీ బగ్గని శ్రీనివాస్ (వరంగల్ రేంజ్), శ్రీ జి. శ్రీనివాస్ వర్మ, శ్రీ ఎ. మధుసూధన్ రెడ్డి, శ్రీ జి.కె. ప్రసాద్ (హైదరాబాద్ రేంజ్) హాజరయ్యారు. ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌ను పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. 2009 బ్యాచ్ ఎస్సైలు సామాజిక బాధ్యతతో తమ సహోద్యోగికి ఆపద సమయంలో చూపిన ఈ మద్దతు ఎందరికో ఆదర్శనీయమని కమిటీ సభ్యులు తెలియచేశారు.

