Singareni | సింగరేణి సంస్థకు ప్రభుత్వాల సహకారం ఏది?

Singareni | సింగరేణి సంస్థకు ప్రభుత్వాల సహకారం ఏది?
- సీఐటీయూ విమర్శ
Singareni | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదని సీఐటీయూ నాయకులు(Leaders of CITU) విమర్శించారు. లాభాల్లో నుంచి 51:49 నిష్పత్తిలో డివిడెండ్లు మాత్రమే తీసుకుని, కొత్త గనుల కేటాయింపు, బకాయిల చెల్లింపులు, కార్మికుల సొంతింటి సమస్యలపై నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిపారు.
ప్రైవేట్ బొగ్గును అధిక ధరలకు కొనుగోలు చేస్తూ, సింగరేణి(Singareni)కి ధరలు తగ్గించమని చెప్పడం అన్యాయమన్నారు. రాజకీయ జోక్యం లేకుండా సింగరేణిని రక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల విధులకు పంపిన సిబ్బందికి ఓడి మస్టర్ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్‌కు సీఐటీయూ లేఖ రాసిందని తెలిపారు.
