మహిళల విజయాలే స్ఫూర్తిగా..

మహిళల విజయాలే స్ఫూర్తిగా..

  • నారీ శక్తి ప్రతిబింబిచేలా ప్రత్యేక చీర..
  • సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ
  • మూడు నెలలపాటు శ్రమించిన హరిప్రసాద్, రేఖ

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : నారి శక్తి ప్రతిబింబించేలా.. మహిళలు సాధించిన అపూర్వ విజయాలే స్ఫూర్తిగా సిరిసిల్ల చేనేత కళాకారుడు మరోసారి తన అద్భుత ప్రతిభతో అబ్బుపరిచేలా చీరను రూపొందించాడు.. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్, రేఖా దంపతులు మూడు నెలల పాటు శ్రమించి ప్రత్యేకంగా చేనేత మగ్గం పై పట్టుచీర నేసారు. నారీ శక్తి స్ఫూర్తితో గత ఏడాది భారత దేశ ఆడబిడ్డలు ఎన్నో ఘనవిజయాలు సాధించారని, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ దేశ మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు.

క్రీడారంగంలోనూ ఆడబిడ్డలు ఎన్నో గొప్ప విజయాలు సాధించారన్నారు. వారి విజయాలన్నీటిని ప్రతిబింబించేలా చేనేత చీరను నేడం జరిగిందని తెలిపారు. దేశ గొప్పతనాన్ని చాటిన ఆడబిడ్డలు అందరికీ అభినందనలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన పట్టుచీరను నేసినట్లు తె లిపారు. దేశ మహిళలు సాధించిన విజయాలు ఆప రేష న సింధూర్తోపాటు షూటర్ సుజిత్ సింగ్ ముఖచిత్రాలు, మహిళా క్రికెట్ వరల్డ్ కప్, మహిళా కబడ్డీ వరల్డ్ కప్, అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్, ఆర్చర్ సీతల్ దేవి జ్యోతి చిత్రాలతో రూపొందించిన చీర విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఒకే చీరపై ఇమిడేలా దేశ మహిళల విజయాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి గుర్తుచె యాలని ప్రత్యేకమైన చీరను సిద్ధం చేశామని, ఈ చీరపై ఉన్న విజయాలను వారిని గుర్తు చేస్తూ వారికి అంకితం చేస్తున్నామని తెలిపారు.

నారీశక్తిని ప్రతిబింబించే చేనేత చీర..

నారీశక్తి స్ఫూర్తితో ఈ ఏడాది మన దేశ ఆడబిడ్డలు ఎన్నో ఘన విజయాలు సాధించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి మన ఆడబిడ్డల సత్తా చాటుకున్నారు. అలాగే విధంగా క్రీడా రంగంలోనూ మన ఆడబిడ్డలు ఈ ఏడాది ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. వారి విజయాలన్నింటినీ చేనేత చీర పై నేసి వారికి అభినందనలు తెలుపాలన్న ఉద్దెశంతో ప్రత్యేకమైన పట్టు చీరను వేశారు.

Leave a Reply