సిక్కోలు జిల్లా బిక్కు బిక్కు

ఆంధ్రప్రభ, ఇచ్ఛాపురం : మొంథా తుపాను తో విస్తారంగా కురుస్తోన్న వర్షాలకు వరద ముప్పు ముంచుకొస్తోంది. ఒడిశా లో బాహుదా నది పై గల భగలట్టి డ్యామ్ 3 గేట్లు ఎత్తివేసినట్లు సమాచారం అందింది . ఇప్పటికే నదిలో ఉదయానికి 5 వేల క్యూసెక్కుల వరద నీరు ఉండగా రాత్రి 8 గంటలకు 47 వేల క్యూసెక్కుల కు మించి ప్రవహిస్తోన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

12 అడుగుల నీటి మట్టానికి చేరుకున్నట్లు గుర్తించారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుండి స్థానికంగా వర్షం ఆగినప్పటికీ ఒడిశా నుండి వరదనీరు చేరదంతో సాయంత్రానికి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది.

పాత వంతెన కూలడంతో ప్రస్తుతం బెల్లుపడ మీదుగా బస్సులు ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే నది పొంగిపొర్లడంతో బెల్లుపడ మార్గం లోని మాలరేవు బట్టి వైపు నుండి పట్టణానికి రాకపోకలు స్తంభించాయి. రోడ్డుపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.

నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ నదిలోకి దిగరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడిక్కడ నడిపైవు వెళ్లే మార్గాలు అధికారులు మూసి వేశారు. మరోవైపు బీమసముద్రం గెడ్డ పొoగడంతో ఇన్నీసుపేట రహదారి మూసి వేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డ్వామా పిడి సుధాకర్ పరిస్థితి స్థానిక అధికారులతో కలసి సమీక్షిస్తున్నారు. మళ్లీ రాత్రి వర్షం ప్రారంభం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply