SIDNY | సిడ్నీలో రోడ్డు ప్రమాదం..
- 20 నెలల భారతీయ గర్భిణీ మృతి..
SIDNY | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సిడ్నీ(SIDNY )లోని హార్న్స్ బై శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన భారతీయ సంతతికి చెందిన మహిళ సమన్విత ధరేశ్వర్ ( SAMANWITHA DHARESWAR) (33) ప్రాణాలు కోల్పోయింది. సమన్విత ధరేశ్వర్ ఆమె భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి జార్జ్ స్ట్రీట్ (JORGE STREET) ప్రాంతంలో రోడ్డు దాడుతుండగా వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో సమన్విత అక్కడిక్కడే మృతి చెందింది. సమన్విత కడుపులోని బిడ్డ కూడా ప్రమాదం తరవాత మరణించింది. కాగా బీఎండబ్ల్యూ (BMW) కారును 19 ఏళ్ల మైనర్ నడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మహిళ రోడ్డు దాటుతుండగా కియా కారు డ్రైవర్ నెమ్మదిగా వెళ్లగా వెనకనుండి బీఎండబ్ల్యూ అతి వేగంగా ఢీ కొట్టిందని తెలిపారు. కియా కారు డ్రావర్ కు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడైన మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు.

