West Godavari | తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
తణుకు : పశ్చిమగోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని పనిచేశారు ఏజీఎస్ మూర్తి.
అయితే ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో ఏజీఎస్ మూర్తి సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు..
దీంతో… పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.