వివాహమైన పదహారు రోజులలోపు కంకణం కట్టుకున్న వారు ఎటువంటి అశుభకార్యాలకు వెళ్ళరాదని శాస్త్రం. పదహారు రోజులు దాటితే ఈ నియమం వర్తించదు. కన్యాదానం చేసినవారు, కన్యను స్వీకరించిన వారు ఆరు నెలల వరకు పరామర్శకు వెళ్లరాదని లోకవ్యవహారం కలదు.
కానీ సొంత అన్నదమ్ములు అంటే జ్ఞాతులు, అక్కా చెల్లెళ్ళు, మేనమామలు, మేనత్త్తలు అయినప్పుడు వారికి సూతకం ఉంటుంది కావున వెళ్ళి తీరాలి, సానుభూతికి, సంతాపానికి, పరామర్శకు, ఓదార్పుకు ఏ నియమాలు వర్తించవు. హృదయం ఉన్నవారు కష్టం వచ్చిన వారిని ఓదార్చడం కనీస ధర్మం. శుభకార్యం జరిగిందన్న సాకుతో ఆప్తులను, రక్త సంబంధీకులను పరామర్పించకపోవడం సమంజసం కాదు. ఇది తప్పించుకోవడమే తప్ప ఆచారం కాదు.
శుభకార్యం జరిగిన ఇంట్లోనివారు అశుభం జరిగిన వారి ఇంటికి పరామర్శకు వెళ్లరాదా?
