పసిడి ప్రియులకు షాక్..

  • అలా.. తగ్గి.. ఇలా ఎగిసిన ధర

ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : రెండు రోజులు ధర తగ్గింపుతో పసిడి ప్రేమికులకు వల విసిరిన బులియన్ మార్కెట్ అకస్మాత్తుగా గూబగుయ్ మనిపించింది. రెండు రోజుల పాటు ఎంత ధర తగ్గిందో.. మూడోరోజు వడ్డీతో సహా వసూలు చేసింది. ఔను.. బంగారం ధర ఎప్పుడూ అ స్థిరత్వమే. ధర దూకుడు, పతనం తాత్కాలికమే. పసిడి ధర ఏ రోజున పెరుగుతుందో.. ఏ రోజున చతికల పడుతుందో.. అంతా సస్పెన్స్ థ్రిల్లింగే. ఒక రోజు స్థానిక వినియోగదారులు బంగారం షాపుల వైపు కన్నెత్తి చూడరు.

ఎప్పుడు బంగారం ధర తగ్గుతుందోనని ఇన్వెష్టర్లు మాత్రం మాటు వేస్తారు. ఇలా మదుపర్లు వచ్చి కొనుగోలు ప్రారంభించగానే.. బులియన్ హీరో రెచ్చిపోతాడు. సరీగా భారత బులియన్ మార్కెట్ ట్రెండ్ సాగుతోంది. లాభాలను ట్రేడర్లు బుక్ చేసుకోవడం, అమెరికన్ డాలర్ బలపడటం, గ్లోబల్ ఎకనామిక్ డేటా జాగ్రత్తలు బంగారం ధరపై అనూహ్య ప్రభావం చూపుతాయి.ఇది అక్టోబర్ 3న తగ్గిన ధర .. అక్టోబర్ 4న మళ్లీ పెరిగింది. ప్రస్తుతం బంగారం ధరలు బుల్లిష్ ట్రెండ్‌లో పరుగులు అందుకున్నాయి.

అమెరియా షట్‌డౌన్ భయాలు, రేట్ తగ్గింపు కారణాలు గోల్డ్ మార్కెట్ ప్రభావం చూపాయి. కేవలం రెండు రోజులు ధర తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వేగం పెంచింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 4 వరకూ మార్కెట్ లో బంగారం కొనుగోళ్లను పరిశీలిస్తే.. అక్టోబరు1 న 1,18,640లు పలికితే.. గురువారం ఉదయానికి రూ.1,19,925లకు చేరింది. కేవలం కొన్ని గంటల్లోనే రూ.1285లు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,660ల నుంచి రూ.1,09,310లకు చేరింది. రూ.1,650లు పెరిగింది.

18 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,080ల నుంచి రూ.89,410లకు అంటే ఈ ఒక్క రోజునే రూ.900లు పెరిగింది. ఈ స్థితిలో బంగారు ప్రియులకు గుండె గుభేలు మనటంతో.. ఇప్పుడిప్పుడే బంగారం కొనొద్దని నిర్ణయించుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రానికి బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.1,19,925ల నుంచి రూ.1,18,690లకు అంటే.. బంగారం ధర రూ.1235లు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,310ల నుంచి రూ,1,08,800లకు చేరింది.

అంటే 510 రూపాయలు తగ్తింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.89,410ల నుంచి రూ. 89,020లు అంటే రూ.390లకు తగ్గింది. శుక్రవారం రాత్రి 8.00 గంటలకు అందిన సమాచారం మేరకు, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.650లు తగ్గింది. గురువారం రూ.1,18,690లు పలికిన మేలిమి బంగారం ధర శుక్రవారం రూ.1,18,040లకు తగ్గింది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ,1,08,800ల నుంచి రూ.1,08,200లకు పడిపోయింది.

అంటే రూ.600లు తగ్గింది. ఇక పది గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 89,020ల నుంచి రూ.88,530లకు పడిపోయింది. అంటే రూ.490లకు తగ్గింది. శనివారం రాత్రి 9.00 గంటలకు అందిన సమాచారం మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,400లకు చేరింది. అంటే ..రూ.1360లు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,09,450లకు చేరింది. అంటే రూ.ధర 1250లు పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.89, 550లకు చేరింది. రూ.1,020లకు చేరింది.

నగరం24 క్యారెట్స్22 క్యారెట్స్18 క్యారెట్స్
హైదరాబాద్రూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
వరంగల్రూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
విజయవాడరూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
గుంటూరురూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
విశాఖపట్నంరూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
చెన్నైరూ.11,946లురూ.10,950లురూ.9,055లు
కోల్కత్తరూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
ముంబైరూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
ఢిల్లీరూ.11,955లురూ.10,960 లురూ.8,970లు
బెంగళూరురూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
కేరళరూ.11,940లురూ.10,945 లురూ.8,955లు
అహ్మదబాద్రూ.11,945లురూ.10,950లురూ.8,960లు
వడోదరరూ.11,945లురూ.10,950లురూ.8,960లు

Leave a Reply