Shirdi Sai Baba | వృక్ష ప్రసాదం పథకంపై కీలక చర్చలు

Shirdi Sai Baba | వృక్ష ప్రసాదం పథకం అమలుపై సాయిబాబా సంస్థాన్‌లో చర్చలు
Shirdi Sai Baba | షిర్డీ, జనవరి 24 (ఆంధ్రప్రభ) – ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త సాయాజీ రావు షిండే సాహెబ్ శనివారం షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా సాయాజీరావు షిండే సాహెబ్ డిమాండ్ మేరకు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అభిషేకం చేసే భక్తులకు వృక్ష ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించడానికి సాయిబాబా సంస్థాన్‌లో చర్చలు నిర్వహించారు. సాయాజీరావు షిండే సాహెబ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ దాద పవార్ సాహెబ్ మహారాష్ట్రలోని ప్రతి జిల్లా, తాలూకాలో సహ్యాద్రి దేవరాయ్ ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్షజీ గడిల్కర్, సంస్థాన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

click here to read Shirdi | షిర్డీలో ఉద్యోగుల జాతీయ మహాసభలు..
