మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్‌..

మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్‌..

  • మౌనంగా ఉండొద్దు… ఫిర్యాదు చేయాలి..
  • వేధించిన వారిపై వెంటనే కఠినచర్యలు
  • రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : మహిళల రక్షణ కోసమే షీ టీమ్‌లు పని చేస్తున్నాయని, వేధింపులకు గురైన సమయంలో మహిళలు, యువతులు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా(Commissioner Amber Kishore Jha) తెలిపారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడవుతూ.. కమిషనరేట్ పరిధిలో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని, షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో, స్కూల్స్, కాలేజీలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై, డయ‌ల్ 100, టీ- సేఫ్ యాప్(T-Safe app), మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, క్యూ ఆర్ కోడ్, వాట్సప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్(She Team) సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీ టీం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.

ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా విద్యార్థినీలు, మహిళలు అత్యవసర పరిస్థితులలో పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్ద‌ప‌ల్లి జోన్‌ షీ టీమ్(Peddapally Zone She Team) నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386లకు కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ సూచించారు.

కాగా, షీ టీమ్స్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల(Manchiryala Zone)లో పబ్లిక్ ప్రదేశాలు, పార్కులు, షాపింగ్ మాల్ ప్రాంతాల్లో డేకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి, మొత్తం 60 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, వారిపై పెట్టి కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇవ్వడం, తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించారు.

Leave a Reply