మంథని, (ఆంధ్రప్రభ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో మంథని పట్టణానికి చెందిన న్యాయవాది కాచే శశిభూషణ్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మరోసారి శశిభూషణ్కు చోటు దక్కడం మంథని కాంగ్రెస్ వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మరోసారి ఈ కమిటీలో నా పేరు సిఫార్సు చేసిన తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, ఛైర్మన్ పి. రాజేష్ కుమార్, నియమించిన పిసిసి అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ లకు ధన్యవాదాలు తెలిపారు. కాచే శశిభూషణ్ నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షణ వ్యక్తం చేశారు.

