Sharwanand | 4 సినిమాలు రిలీజ్ చేయనున్నాడా..?

Sharwanand | 4 సినిమాలు రిలీజ్ చేయనున్నాడా..?

ఆంధ్ర్రప్రభ వెబ్ డెస్క్ : శర్వానంద్.. ఒకప్పుడు వరుసగా సక్సెస్ అందించాడు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ లో వెనకబడ్డాడు. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు. అయితే.. ఇప్పడు స్పీడు పెంచాడని… 4 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడనే వార్త వైరల్ అయ్యింది. ఇంతకీ.. శర్వా నుంచే సినిమాలు ఏంటి..? సంక్రాంతికి వచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేసేనా..?

Sharwanand

సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో శర్వానంద్ చాలా కాలం తర్వాత అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదే ఊపు.. ఇదే స్పీడు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాడట. నెక్ట్స్ మూవీగా బైకర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఆమధ్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. త్వరలో రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారని సమాచారం.

Sharwanand

సంపత్ నంది డైరెక్షన్ లో శర్వానంద్ ఓ భారీ చిత్రం చేయనున్నాడు. దీనికి భోగి అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. విభిన్న కథాంశంతో రూపొందే ఈ సినిమాను ఈ ఇయర్ లోనే విడుదల చేయాలి అనుకుంటున్నారు. దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనేది ప్లాన్. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Sharwanand

ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు శర్వా ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అంటే.. 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతి వరకు ఏకంగా నాలుగు సినిమాలు శర్వా రిలీజ్ చేస్తుండడం విశేషం. మరి.. నారీ నారీ నడుమ మురారి సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన శర్వా.. ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

CLICK HERE TO READ పట్టాలెక్కేది ఎప్పుడు..?

CLICK HERE TO READ MORE

Leave a Reply