Swiss Open | క్వార్టర్స్‌కు శంకర్ సుబ్రమణియన్ !

స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో భారత యువ ఆటగాడు శంకర్ సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈరోజు (శుక్రవారం) జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ లో… డెన్మార్క్ కు చెందిన ప్రపంచ నంబర్.2 ఆండర్స్ ఆంటోన్సెన్ తో తలపడిన శంకర్ సుబ్రమణియన్ 18-21, 21-12, 21-5 తేడాతో విజయం సాధించాడు.

ఈ టోర్నమెంట్‌లో భార‌త‌ స్టార్ ప్లేయ‌ర్లంతా మొదటి రెండు రౌండ్లలో ఇంటిముఖం పట్టగా… పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరపున పోరాడుతున్న ఏకైక ఆటగాడిగా శంకర్ సుబ్రమణియన్ నిలిచాడు.

ఇప్పటికే క్వార్టర్స్ కు చేరుకున్న భారత మహిళల జోడీ గాయత్రి-ట్రిసా.. ప్రస్తుతం హాంకాంగ్ జోడీ పుయ్ లామ్-యెంగ్ తో తలపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *