Shamshabad | ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..
అప్రమత్తమైన అధికారులు
Shamshabad | శంషాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : లండన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ బీటీఏ 277 (British Airways flight BTA 277) ను పేల్చేస్తామని, అబుదాబి నుంచి వచ్చే ఇండిగో ఫ్లైట్ 6E 1408ను కూలుస్తామని గుర్తుతెలియని దుండగులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-మెయిల్ పంపారు. ఈ బెదిరింపు సందేశాలు రావడంతో విమానాశ్రయ భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తమయ్యాయి.
బీటీఏ 277పై బాంబు డాగ్ స్క్వాడ్ తనిఖీలు..
లండన్ (London) నుంచి రాత్రి 2:45 గంటల సమయంలో శంషాబాద్‌కు చేరుకున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాన్ని రన్‌వేలోనే ఐసోలేట్ చేసిన భద్రతా సిబ్బంది, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు.
ఇండిగో 6E 1408ను ముంబైకి డైవర్ట్..
అదే సమయంలో అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 1408 (IndiGo flight 6E 1408)ను ముంబైకి దారి మళ్లించారు. ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి భద్రతా బలగాలు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ఈ విమానంలోనూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని అధికారులు తెలిపారు.
సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు..
ఈ బెదిరింపు మెయిల్స్‌ను పంపిన దుండగులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు (Cybercrime police) దర్యాప్తు ప్రారంభించారు. ఐపీ అడ్రస్‌లు, ఈ-మెయిల్ సోర్స్‌లను ట్రేస్ చేస్తున్నట్లు సమాచారం. విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని, భద్రతా చర్యలు పూర్తిగా అమలులో ఉన్నాయని హామీ ఇచ్చారు.

