అన్ని ఏఐ అంటావ్.. నిజం ఒప్పుకో

అన్ని ఏఐ అంటావ్.. నిజం ఒప్పుకో
బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టాన్ని మరిచిపోయావు
రాజ్యాంగాన్ని కించపరిస్తే చట్టం తన పని చేస్తుంది
ఆడియోలు, వీడియోలు అన్ని ఏఐ సృష్టి అని చెప్పడం సిగ్గుచేటు!
స్టేషన్ ఘన్‌పూర్ ప్రజల ముందు నిజం చెప్పే ధైర్యం ఉందా?
పదేళ్లు బిఆర్ఎస్ లో ఉన్నావ్..ఇప్పుడు అన్ని ఏఐ అనడం సరైనదా?
అంబేద్కర్ సెంటర్ వద్ద రాజ్యాంగంపై ప్రమాణం చేయాలని సవాల్
స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఖబర్దార్, రాజ్యాంగాన్ని కించపరచవద్దు, ప్రజల తీర్పును అవమానించవద్దు, బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టాన్ని మరిచి పోవొద్దు, ఘన్‌పూర్ ప్రజలు సాక్షిగా నిజం చెప్పే ధైర్యం ఉంటే అంబేద్కర్ సెంటర్ వద్ద నిలబడి తాను ఏ పార్టీలో ఉన్నానో రాజ్యాంగం పై ప్రమాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. దేవుడు, కుటుంబం మీద ఒట్టు అవసరం లేదు. రాజ్యాంగంపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తప్పక శిక్ష విధిస్తుందని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియం శ్రీహరి రాజ్యాంగ బద్ధంగా వచ్చిన ఎమ్మెల్యే పదవిని కొనసాగిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. త్రికరణ శుద్ధితో దేవుడు సాక్షిగా తాను ప్రమాణం చేస్తున్నానని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరితే ధైర్యంగా ప్రకటించాలి
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరితే ధైర్యంగా ప్రకటించాలి. బీఆర్ ఎస్ విధానాలు నచ్చకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. ఒక పార్టీ నుంచి పదవి అనుభవిస్తూ మరో పార్టీలో ప్రయోజనాలు పొందడం ద్వంద్వ వైఖరేనని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడం ప్రజలను అవమానపరచడమేనని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఆయన వ్యాఖ్యలను ఆశ్చ ర్యంగా చూస్తున్నారని తెలిపారు. నాలుగు శాఖల్లో మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దళిత సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందన్నారు. స్పీకర్, న్యాయవాదుల సమక్షంలో ఆడియోలు, వీడియోలు అన్ని ఏఐ సృష్టి అని చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. దీపదాసు మున్షి, మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసిన విషయం ఏఐ సృష్టేనా అని ప్రశ్నించారు. పదేళ్లు బీఆర్‌ఎస్ పార్టీలో అనుభవాలు పొందిన తర్వాత ఇప్పుడు ఆ వ్యాఖ్య లన్నీ ఏఐ సృష్టి అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.

కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించడం తగదు
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కృషితో అధికారంలోకి వస్తే కష్టపడ్డ సీనియర్ నాయకులు, కార్యకర్తలను అవమానించడం తగదని రాజయ్య అన్నారు. నీ దగ్గర అనుచరులు కూడ నిన్ను అసహ్యంగా ఉంచే పరిస్థితి ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వెనుకడుగు వేయబోనని, దళిత సమాజం, ఘన్ పూర్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. నీకు కరు కాల్చి వాత పెడుతారు. రాజకీయం సమాధి పెట్టి పర్వతగిరి పంపిస్తారని రాజయ్య హేచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అక్కనపల్లి బాలరాజు, కీర్తి వెంకటేశ్వర్లు, కౌన్సెలర్ లు తాటికొండ మధు, బూర్ల రాజేశ్వర్, చల్లారమ్య రఘు రెడ్డి, పొన్న రాజేష్, బాల గాని అనిల్ గౌడ్, నాయకులు చల్లా చందర్ రెడ్డి, రాజన్ బాబు, శీలం శ్యామ్ కుమార్, మారేపల్లి ప్రసాద్ బాబు, అశోక్, మల్లేష్, తాటి కొండ మధు, తదితరులు పాల్గొన్నారు.
