SGFI | జాతీయ స్థాయి పోటీలకు…

SGFI | జాతీయ స్థాయి పోటీలకు…

  • సుండుపల్లె విద్యార్థుల ఎంపిక‌
  • బేస్ బాల్ రాష్ట్ర జట్టులో ఒకరికి స్థానం
  • సాఫ్ట్‌ బాల్ రాష్ట్ర జట్టులో ఇద్దరికి చోటు

SGFI | సుండుపల్లె(అన్నమయ్య జిల్లా), ఆంధ్రప్రభ : ఎస్జీఎఫ్ఐ (SGFI) జాతీయ స్థాయిలో నిర్వహించే బేస్ బాల్, సాఫ్ట్‌ బాల్ క్రీడలకు మండల కేంద్రమైన సుండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ విద్యార్థులు ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రలోని నాగపూర్‌లో జరిగే ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడా జట్లకు ఎంపికయ్యారు.

SGFI

చిత్తూరు జిల్లా పలమనేరులోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గత నెల 29నుంచి ఈనెల ఒకటవ తేదీ వరకు జరిగిన అండర్ 14 బేస్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (School) ఎనిమిదవ తరగతి చదువుతున్న కోసిక నాగ చైతన్య, గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదకూరు వేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 6నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 19 బాలుర, బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలలో సుండుపల్లె ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ సత్తా చాటారు. దీంతో వారు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారు.

సాఫ్ట్ బాల్ అండర్ 19బాలికల విభాగంలో సుండుపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికల (Girls) విభాగంలో నంద్యాల బేబి, బాలుర విభాగంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె. వెంకటేశ్వర్లు రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల రాష్ట్ర జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో వివిధ జిల్లాల మధ్య జరిగిన పోటీలలో సత్తా చాటి బెస్ట్ క్యాచర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా వెంకటేశ్వర్లు ఎంపికయినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాధారాణి తెలిపారు. అండర్ 14, అండర్ 19 బేస్ బాల్, సాఫ్ట్ బాల్ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలు, సెలెక్షన్స్ లలో నాగ చైతన్య, నంద్యాల బేబి,వెంకటేశ్వర్లు ఉత్తమ ప్రతిభ కనబరచి జట్ల ఎంపికలో కీలకమైన సెలెక్టర్లను ఆకట్టుకుని ఒక్కో మెట్టు పైకి వెళుతు జాతీయ స్థాయి క్రీడలకు ఆంధ్రప్రదేశ్ జట్లలో స్థానం దక్కించుకుని పాఠశాలకు గుర్తింపు తీసుకురావడం విశేషం.

Leave a Reply