Sfi |హామీలు కాదు – అమలు కావాలి..

Sfi |హామీలు కాదు – అమలు కావాలి..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలి-ఎస్ఎఫ్ఐ

Sfi | గుంటూరు, ఆంధ్రప్రభ: ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ సుమారు 7000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సార్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేసి పేద విద్యార్థులను కాలేజీల నుంచి బయటకు తోసే ప్రభుత్వ విధానాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది.జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నారు. అయితే, గత మూడు నాలుగు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటివరకు విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం కారణంగా ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, పరీక్షలకు హాజరు కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇది విద్యార్థుల విద్యా హక్కులపై దాడిగా మారింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్‌ను సకాలంలో విడుదల చేయడం ప్రభుత్వ బాధ్యత. దీనిలో జరుగుతున్న ఆలస్యం వల్ల పేద, బడుగు, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.కావున ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకొని,పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని అలాగే ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఎస్ఎఫ్ఐ (SFI) డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గుంటూరు నగర అధ్యక్షులు కిరణ్ దాసరి, ఎస్ఎఫ్ఐ మంగళగిరి అధ్యక్ష కార్యదర్శులు కే రాజ్ కుమార్, ఎన్.ధనుష్, తెనాలి కార్యదర్శి కే సుభాష్, కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ నాయక్, ధనుంజయ్, నవీన్ బాబు, పరిశుద్ధ తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply