sexual assault | రేపిస్టుకి 20 ఏళ్లు జైలు

sexual assault | రేపిస్టుకి 20 ఏళ్లు జైలు

sexual assault | విజయవాడ ( క్రైమ్)ఆంధ్రప్రభ : ఓ మైనరు బాలికపై లైంగిక దాడి(sexual assault)కి పాల్పడిన దోషికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అజిత్‌సింగ్ నగర్ లోని ఓ కిరాణా షాపులో పనిచేస్తున్న పదిహేనేళ్ల బాలికను వల్లేపు వసంతకుమార్ ఆటోలో ఎక్కించుకొని ఎక్స్‌ఎల్ ప్లాంట్‌(XL Plant)లోని ఓ గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. చార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణలో సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు నేరాన్ని స్పష్టం చేయడంతో ప్రత్యేక కోర్టు(Special Court) వసంత కుమార్ ను దోషిగా నిర్ధారించింది. ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానాలోని అయిదు వేల రూపాయలు బాధిత బాలికకు నష్టపరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

అప్పటి ఐవో అజిత్‌సింగ్(Ivo Ajitsingh) నగర్ సీఐ ఎస్‌.వి‌.వి‌. లక్ష్మీనారాయణ, సీఎంఎస్ సీఐ జగదీశ్వరరావు(CMS CI Jagadiswara Rao), ప్రస్తుత అజిత్‌సింగ్ నగర్ సీఐ బి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మొత్తం ఐదుగురు సాక్షులను కోర్టు విచారించిందది. ప్రత్యేక పీపీ గడ్డం రాజేశ్వరరావు తన వాదనలు వినిపించారు.

Leave a Reply