Seva Trust | ప్రారంభమైన అన్నదానం……

Seva Trust | ప్రారంభమైన అన్నదానం……

Seva Trust | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కేరళ బార్డర్ లోని తమ్మనం పట్టి అయ్యప్ప దేవాలయంలో శ్రీ షష్ఠ అన్న ప్రసాద సేవా ట్రస్ట్(Sri Shashtha Anna Prasad Seva Trust) అధ్యక్షుడు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి జనవరి 15 వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని పందలం రాజు రాజా రవి వర్మ ఈ నెల 15న అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు భోజనాలు ఏర్పాటు చేశామని అలాగే రాత్రి అల్పాహారం(Breakfast) అయ్యప్పలకు ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు.

అయ్యప్ప స్వాములు(Ayyappa Swamulu) అందరూ దిండిగల్ నుండి కుమ్లి పోయే దారిలో తమనం పట్టిలో ఉంటుందని ఇక్కడ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా అధ్యక్షుడు చంద్రశేఖర శర్మ కోరారు. ఈ ప్రారంభోత్సవానికి పందాలం రాజు రాజా రవి వర్మతో పాటు, నాచారం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామీజీ, మల్లారం స్వామీజీ బాలయోగి, పిట్ల కృష్ణ స్వామీజీ పాల్గొన్నారు.

భోజనాలని బఫే సిస్టం(Buffet System)లో కాకుండా కూర్చొని భోజనం పెట్టడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని, అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా గొప్పదని అయ్యప్పలకి భోజనం పెట్టడం మా అదృష్టం అన్నారు. శ్రీ శాస్త్ర అన్నప్రసాద సేవ ట్రస్ట్ వాళ్ళని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి భాను దాస్ కులకర్ణి, లక్ష్మారెడ్డి, ప్రకాష్, మణిరాజ్ ,సంస్థసభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply