మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని బీజేపీ సీనియర్ నాయకులు జీవి రమణారావు.. మార్కెట్ ఎండి శ్రీనివాస్ రెడ్డిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన అకాలవర్ష బీభత్వానికి చేతికొచ్చిన పంటలు నేల కొరిగాయని రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి అన్నారు.

మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలతో పాటు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయని.. వాటికి నష్టపరిహార అందేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి అన్నారు. దీంతో తాను సానుకూలంగా స్పందించిన ఎండి సంబంధిత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు అనుమతి వచ్చినట్టుగా మాజీ ఎంపీపీ జీవి రమణారావు తెలిపారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజేందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply