270కి పైగా పట్టణాల్లో సేవలు..

బెంగళూరు: అమెజాన్ ఇండియా, ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా తమ గ్రోసరీ సేవ అమెజాన్ ఫ్రెష్ ను దేశవ్యాప్తంగా 270కి పైగా పట్టణాలకు విస్తరించింది.

ఈ మైలురాయితో, తాజా పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, పాల ఉత్పత్తులు, గృహావసర వస్తువులు, స్థానికంగా ప్రజలు మెచ్చిన వస్తువులు ఇలా 40,000కిపైగా ఉత్పత్తులు ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. 2023లో ఉన్న 4,000 ఉత్పత్తులతో పోలిస్తే ఇది పది రెట్లు పెరుగుదల.

గోరఖ్‌పూర్, డెహ్రాడూన్, జాలంధర్, జిర్కాపూర్, కోయంబత్తూర్, నెల్లూరు, వరంగల్, విజయనగరం, తిరుపతి, హుబ్లి, జమ్షడ్పూర్, ఆసన్సోల్, దుర్గాపూర్ వంటి పట్టణాలు కొత్తగా అమెజాన్ ఫ్రెష్ సేవల్లో చేరాయి.

వేగవంతమైన డెలివరీ & స్థానిక ఉత్పత్తులు

అమెజాన్ ఫ్రెష్ రెండు గంటల డెలివరీ స్లాట్లలో సరఫరా చేస్తుంది. 3,000కి పైగా స్థానిక ఉత్పత్తులు (రాజధానీ గోధుమపిండి, ఈస్టర్న్ మసాలాలు, GRB స్వీట్స్, శ్రీ భాగ్యలక్ష్మి ధాన్యాలు మొదలైనవి) కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

సంస్థ ప్రతినిధుల వ్యాఖ్యలు..

అమెజాన్ ఫ్రెష్ ఇండియా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ… “రెండు సంవత్సరాల్లో 4.5 రెట్లు చేరిక పెరిగింది, ఎంపికలో 10 రెట్లు పెరిగింది. పండుగ సమయంలో తాజాదనం, పొదుపు, సౌలభ్యం అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.

మోర్ రీటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ నంబియార్ మాట్లాడుతూ, “మా 370 స్టోర్లు అమెజాన్ ఫ్రెష్ ద్వారా కస్టమర్లకు చేరుతున్నాయి. 2024లో వ్యాపారం 65% పెరిగింది” అని అన్నారు.

రైతులతో భాగస్వామ్యం

దేశవ్యాప్తంగా 13,000కి పైగా రైతులతో ప్రత్యక్ష భాగస్వామ్యం ద్వారా పొలం-నుంచి-గుమ్మం వరకూ సరఫరా చేసే బలమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. ప్రతి ఉత్పత్తి నాలుగు దశల నాణ్యతా పరీక్షల తర్వాతే వినియోగదారులకు చేరుతుంది.

పండుగ ఆఫర్లు

అమెజాన్ ఫ్రెష్ కస్టమర్లు రూ.1 నుండి ప్రారంభమయ్యే ఆఫర్లు, రూ.400 వరకు క్యాష్‌బ్యాక్, దీపావళి డెకర్ ఎసెన్షియల్స్, వీకెండ్ సూపర్ వాల్యూ డేస్ ద్వారా అదనపు పొదుపులను పొందవచ్చు.

Leave a Reply