Service Road | వెంటనే మరమ్మతులు చేపట్టాలి

Service Road | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నుంచి జాతీయ రహదారి వరకు వేసిన సర్వీస్ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సర్వీస్ రోడ్డును నిర్మించినప్పటికీ, అక్కడక్కడ గుంతలు ఏర్పడి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై గుంతలతో పాటు దుమ్ము, ధూళి అధికంగా ఎగసిపడడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం గుండా నిత్యం స్థానిక అధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ, సమస్యను పట్టించుకోకుండా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని పనుల కారణంగానే రోడ్డు తక్కువ కాలంలోనే దెబ్బతిందని వారు విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్ తక్షణమే స్పందించి సర్వీస్ రోడ్డుకు సమగ్ర మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply