service | సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

service | సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

  • స్ఫూర్తిదాయక సేవలందిస్తున్న డాక్టర్ కందులకు అభినందనలు
  • మానవత్వంతో ప్రతి ఒక్కరు స్పందించాలి

service | అల్లిపురం, ఆంధ్ర‌ప్ర‌భ : సేవా భావంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు వద్ద 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది పుష్పవతి అయిన అమ్మాయిలకు వెండి భరణిలు, పట్టు చీరలు, పసుపు కుంకుమలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ… కె.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా, కార్పొరేటర్ గా విస్తృత సేవలు అందిస్తున్న డాక్టర్ కందుల నాగరాజును ఆయన అభినందించారు. సేవే దైవంగా భావించి, అందరికి అందుబాటులో ఉంటూ, నిస్వార్థ సేవలందిస్తు, అందరికీ ఆప్తుడుగా మారిన కందుల నాగరాజు ఎంతోమందికి స్ఫూర్తిదాయంగా నిలిచారని కొనియాడారు.

service |

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సేవకు సరిహద్దులు, పరిమితులు లేవని చెప్పారు. సాటి వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో స్పందించి నిస్వార్ధ సేవలు అందించాలని పేర్కొన్నారు.

service |

ఈ క్రమంలో తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.ఇందులో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో 32, 33, 34, 36వ వార్డులకు సంబంధించి పుష్పవతి అయిన 12 మంది అమ్మాయిలకు పట్టు చీరలు, వెండి భరణిలు, పసుపు కుంకుమలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే తమ ట్రస్ట్ నుంచి నూతన వధువులకు బంగారు తాళిబొట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

నిరుపేద విద్యార్థులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వివ్యాంగులకు అండగా ఉంటూ వారికి తన పరిధిలో సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ డాక్టర్ కందుల సేవలను కొనియాడారు.

ధనం కంటే దానమే శాశ్వతమని, ఆ పేరును కందుల నిలబెడుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్ మాట్లాడుతూ ఎటువంటి స్వలభాపేక్ష లేకుండా ఎంతమందికి తన పరిధి మేరకు సహాయం చేస్తూ వస్తున్న డాక్టర్ కందుల నాగరాజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

service |

ఈ కార్యక్రమంలో మచ్చ రాజు, నరేష్, రమేష్ పాడి,సీపీఐ బుజ్జి, బిజెపి వీరభద్రరావు, జనసేన మహిళా నేత నాగమణి, కె.కృష్ణ, కె.రమేష్,రాగతి తాతారావు, సోషల్ వర్కర్ గీత, అయేష, చిట్టెమ్మ, కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్, దుర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Funds | కృతజ్ఞతలు చెప్పడానికే ఈ ప్రాంతం వచ్చా

CLICK HERE TO READ MORE :

Leave a Reply