లైంగిక‌దాడికి పాల్ప‌డిన ల‌తీఫ్‌కు శిక్ష‌

లైంగిక‌దాడికి పాల్ప‌డిన ల‌తీఫ్‌కు శిక్ష‌

ఉమ్మ‌డి నిజామాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : హిందువుగా మారుతాన‌ని న‌మ్మించి మహిళను ప్రేమిస్తున్నానని లైంగిక దాడికి పాల్ప‌డిన‌ మహమ్మద్ అబ్దుల్ లతీఫ్(Mohammed Abdul Latif) కు ప‌దేళ్ల‌ కఠిన జైలు శిక్ష, మోసం చేసినందున మరో సంవత్సరం సాధారణ జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష ఈ రోజు తీర్పు చెప్పారు.

హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగదీసుకుని ఆమె ఇంటిలో, అతని ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక‌దాడి చేశాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. ఈ నేరాలు రుజువు కావ‌డంతో మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ దోషిగా నిర్ణ‌యిస్తూ స్పెష‌ల్ జ‌డ్జి(Special Judge) తీర్పు ఇచ్చారు.

లైంగిక దాడి చేసిన నేరానికిగాను పది సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించక‌పోతే ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీష(Additional Sessions Harisha) తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. అలాగే బాధిత మ‌హిళ‌కు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాల‌ని తీర్పులో పేర్కొన్నారు.

Leave a Reply