న్యూ ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. దేశంలో కులగణన చేయాలని నిర్ణయించింది. జనభా గణనతో పాటే కులగణన చేయాలని మోదీ క్యాబినేట్ నిర్ణయించింది. కులగణన పారదర్శకంగా చేస్తామని వెల్లడించింది. నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినేట్ భేటి జరిగింది. ఈ సమావేశంలో ఈ కుల గణన నిర్ణయం తీసుకున్నారు.. ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు..
కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ర్టాలలో కులగణన చేసిందని, అయితే పారదర్శకత లోపించిందని అన్నారు. తాము సర్వే రూపంలో కాకుండా, కులగణనను జనాభా గణనతో పాటు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.. దాంతో పాటే సిల్చార్-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం, చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం, క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంపు, అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి సంబంధించి కూడా కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు.