అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస‌ విడిచిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు

అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస‌ విడిచిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు

  • రేపు ఉద‌యం 9గంట‌ల‌కు స్వ‌గ్రామం క‌దిరిలో అంత్య‌క్రియ‌లు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆదివారం ఉదయం కదిరిలోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. సోమ‌వారం ఉదయం 9 గంటలకు కదిరి పులివెందుల రోడ్డులోని కదిరికుంట్ల పల్లి దగ్గర ఉన్న వారి ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆది నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ ఆ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడిగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతి ప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిర్వహించిన అనేక ఆందోళనలు, ఉద్యమాలకు ముందుండి కదిరి నియోజకవర్గం తరఫున పోరాటం సాగించారు. పలు కేసులు సైతం డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి పై నమోద‌య్యాయి. సబ్ జైలు సైతం వెళ్లారు.

Leave a Reply