- చిత్తూరు డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి పిలుపు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: హింస లేని కుటుంబాలే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది కృషి చేయాలని చిత్తూర్ డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరు డీఆర్డీయే సమావేశ మందిరంలో క్షేత్రస్థాయిలోని సిబ్బందికి, మండల జిల్లా సమాఖ్య ప్రతినిధులకు జెండర్ కార్యక్రమాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, అయితే సంఘాల్లోని మహిళలకు ఆర్థిక వనరులు అందుకుంటున్న కుటుంబంలో హింస కారణంగా ఈ వనరులను సక్రమంగా సద్వినియోగం కాకపోవడంతో ఆశించిన స్థాయిలో పేదరిక నిర్మూలనా లక్ష్యం నెరవేరటం లేదన్నారు.
దీన్ని అధికమించాలంటే ప్రధానంగా కుటుంబాల్లో హింసను అరికట్టాల్సి ఉందన్నారు. పేదరికం పెంచే సామాజిక సమస్యలన్నిటిని గుర్తించి పరిష్కరించడానికి సిబ్బంది సామాజిక అజెండాను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బలమైన కుటుంబ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం అందించే పలు పథకాలను సక్రమంగా వినియోగంలో ఉండవని మంచి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. ఈ సమస్యను అధికమించాలంటే మహిళల్లో నిర్ణయాత్మక శక్తిని పెంచడంతోపాటు వారి భాగస్వామాన్ని పెంచి వివక్ష కు వ్యతిరేకంగా చైతన్యవంతులు చేయాలన్నారు.
అప్పుడే నిజమేనా అభివృద్ధిని సాధించవచ్చునని చెప్పారు. ప్రధానంగా జిల్లా మండల సమాఖ్యలతో పాటు పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కుటుంబ సమస్యలను పరిష్కరించి వారి ఆలోచన శక్తిని నైపుణ్యాలను పెంచి ఆర్థిక స్వాలంబనకు చొరవ చూపాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు సహాయ సహకారాలు అందించాలన్నారు అప్పుడే సమాజం అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. మహిళా చట్టాలు వారి హక్కుల గురించి గ్రామస్థాయిలో చర్చ జరగాలన్నారు.
ద్వారా గ్రామీణ ప్రాంతంలోని మహిళల్లో కొంతవరకు చైతన్యం వచ్చి ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని జీవనోపాదులు పెంచుకుంటారని తెలిపారు. సంఘాల స్థాయిలో ఉన్న సామాజిక సమస్యలను , సంఘాల కుటుంబాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అలాగే ఆరోగ్య విషయాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారి వాణి మహిళ ఆరోగ్య సంరక్షణ అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య డిడి మహమ్మద్ ఆజాద్, డీపీఎం మంజుల, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి,హేమ పాల్గొన్నారు.