నిషేధిత గంజాయి పట్టివేత

నిషేధిత గంజాయి పట్టివేత
- ఇద్దరు అరెస్ట్
- చిట్యాల సీఐ మల్లేష్ వెల్లడి
చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద సీసీఎస్ టీం, చిట్యాల పోలీసులు, సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించగా, బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకుని, వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు చిట్యాల సిఐ దగ్గు మల్లేష్ గురువారం తెలిపారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూభూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్, ఆదేశాల మేరకు సీసీఎస్ టీం, చిట్యాల పోలీసులు సంయుక్తంగా మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న చల్లగరిగకు చెందిన పోతుల నర్సింగరావు, పల్లెర్ల మధుకర్ ,ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 1 కిలో 300 గ్రాముల నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గంజాయి విలువ సుమారు రూ.65,000,ఒక బైక్ , సెల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు పోతుల నర్సింగరావు. పల్లెర్ల మధుకర్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. అనంతరం సీఐ మల్లేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని కోరారు. చిట్యాల ఎస్‌ఐ పోచంపల్లి సతీష్, మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. ఎవరికైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 100 డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సెకండ్ ఎస్సై హేమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
