ఇంటింటికి సీతక్క..

ఇంటింటికి సీతక్క..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మరింత జోరుపెంచారు. ఈరోజు బోరబండ సైట్ 3 లో మంత్రి సీతక్క ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలుస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ ని గెలిపిస్తేనే.. అభివృద్ధి వేగవంతమవుతుందని ఓటర్లకు సీతక్క వివరిస్తున్నారు. డమ్మీ ఈవీఎంను చూపిస్తూ రెండో బటన్ పై నొక్కి కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను మంత్రి సీతక్క కోరుతున్నారు.
