సీక్రెట్ కెమెరా కలకలం

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ (University) బాలికల టాయిలెట్లో సీక్రెట్ కెమెరా ( Secret Camera) అమర్చడం కలకలం రేపింది. ఓ బాలిక టాయిలెట్ గదిలో ఉన్న సీక్రెట్ కెమెరాను గుర్తించి యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడంతో అసలు విషయం బయటపడింది. సైట్ ఇంజనీర్ ఆ టాయిలెట్ లో సీక్రెట్ మొబైల్ కెమెరా అమర్చినట్లు గుర్తించారు. యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు చిత్తూరు (Chittoor) తాలూకా సిఐ నిత్య బాబు ఇతర పోలీసులు టాయిలెట్ గదిని పరిశీలించి గదిలో అమర్చిన సీక్రెట్ మొబైల్ కెమెరా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిసింది.

అలాగే యూనివర్సిటీలోని పలు మరుగుదొడ్లను సైతం పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తాలూకా సిఐ నిత్య బాబు (CI Nithya Babu) దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బాత్రూంలో ఆలస్యంగా వెలుగు చూసింది. టాయిలెట్స్ లో శబ్దం వస్తుందని గమనించిన విద్యార్థిని, ఈనెల 1న యూనివర్సిటీ రిజిస్టార్ కు సమాచారం అందించింది. అపోలో యూనివర్సిటీ రిజిస్టార్ పోతురాజు రహస్యంగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి విచారణ చేసి, చిత్తూరు తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ఓ ప్రైవేటు సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్, విరుద్ నగర్ జిల్లా వాసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి ఇప్పటికే మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చిత్తూరు తాలూకా సిఐ నిత్య బాబు తెలిపారు.

Leave a Reply