16 మంది కూటమి సభ్యులకు స్థానం..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పూర్తిస్థాయి పాలక మండలి (బోర్డు) నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈసారి మొత్తం 16 మందిని సభ్యులుగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే కృష్ణా జిల్లా నేత బొర్రా రాధాకృష్ణ చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.

తాజాగా ఎంపికైన ఈ 16 మంది సభ్యులలో, అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులకు ప్రాధాన్యం కల్పించారు. ఈ నియామకాలతో దుర్గగుడి ఆలయ కమిటీకి పూర్తిస్థాయి బోర్డు ఏర్పడింది.

కొత్తగా నియమిత సభ్యుల జాబితా..

  1. అవ్వారు శ్రీనివాసరావు.. – విజయవాడ వెస్ట్ – ( బీజేపీ)
  2. బడేటి ధర్మారావు ..- విజయవాడ సెంట్రల్ (- టీడీపీ)
  3. గూడపాటి వేంకట సరోజినీ దేవి.. – మైలవరం – (టీడీపీ)
  4. జీవీ నాగేశ్వర్ రావు… – రేపల్లె – (టీడీపీ)
  5. హరికృష్ణ – హైదరాబాద్ -..( టీడీపీ తెలంగాణ)
  6. జింకా లక్ష్మీ దేవి ..- తాడిపత్రి –( టీడీపీ)
  7. మన్నె కళావతి – .. నందిగామ (- టీడీపీ)
  8. మోరు శ్రావణి – దెందులూరు – ( టీడీపీ)
  9. పద్మావతి ఠాకూర్ – విజయవాడ వెస్ట్ – (జనసేన)
  10. పనబాక భూ లక్ష్మి.. – నెల్లూరు రూరల్ –( టీడీపీ)
  11. పెనుమత్స రాఘవ రాజు ..- విజయవాడ సెంట్రల్ (- బీజేపీ)
  12. వెలగపూడి శంకర బాబు -.. పెనమలూరు – ( టీడీపీ)
  13. సుకాశి సరిత.. – విజయవాడ వెస్ట్ – (టీడీపీ )
  14. తంబాళపల్లి రమాదేవి .. – నందిగామ – (జనసేన)
  15. తోటకూర వేంకట రమణా రావు.. – తెనాలి( – జనసేన )
  16. అన్నవరపు వేంకట శివ పార్వతి.. – పెనమలూరు –( టీడీపీ)

Leave a Reply