ఏప్రిల్ 1వ తేదీ వరకు కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

ఏప్రిల్ 1వ తేదీ వరకు కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

గంపలగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్దకొమిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 2026- 2027 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలకై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ మోదుగు వెంకట లక్ష్మీ అన్నారు. ఆమె ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేసి వివరాలు తెలిపారు. అనాధలు, తల్లి లేదా తండ్రి లేని ఆడపిల్లలు,గ్రామీణ ప్రాంతాలలో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న ఆడపిల్లలకు కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం గొప్ప వరంగా ఉంటుందని అన్నారు.

2011 నుండి అందుబాటులో ఉన్న ఈ పాఠశాలలో అనేక మంది ఆడపిల్లలు చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో ఆరవ తరగతి,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు,7,8,9,10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలకై నోటిఫికేషన్ ఈ నెల 12వ తేదీన విడుదల అయిందని తెలిపారు. పూర్తి వివరాలు, దరఖాస్తు సంబంధిత వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీట్లు 40 అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Leave a Reply