విద్యార్థుల నైపుణ్యతకు విజ్ఞాన యాత్ర దోహదం..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థుల నైపుణ్యతకు విజ్ఞాన యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జండా ఊపి ఆయన బస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలోని విద్యార్థులలో విజ్ఞాన ఆసక్తి శాస్త్రీయ గొప్పదం పెంపొందించాలన్న ఉద్దేశంతో క్రైమ్ ఫ్రీ ఇండియా వ్యవస్థాపకులు గడ్డం మల్లేష్ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని చెప్పారు. గత నెలలో 11 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ పై టాలెంట్ పరీక్షలు నిర్వహించారు.

అందులో ప్రతిభ కనబరిచిన 39 విద్యార్థులను ఎంపిక చేశారు ఇస్రో ఆధ్వర్యంలో నేషనల్ రిమోట్ పెన్సిల్ సెంటర్, ఆజాద్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, సందర్శన కోసం అట్టి విద్యార్థులు వెళ్లడం ఎంతో అభినందనీయమని చెప్పారు. విజ్ఞాన యాత్ర ద్వారా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ సాంకేతిక ఆధునిక ఇంజనీరింగ్, పరిజ్ఞానం వంటి అంశాలపై పూర్తి అవగాహన వస్తుందని ఆయన తెలిపారు. చదువుతోపాటు విహారయాత్రలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్యాల రేఖా సుదర్శన్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Leave a Reply