School | విద్యార్థులందరికీ వివిధ సామాగ్రి పంపిణీ..
School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు ఈ రోజు పాఠశాల అధ్యక్షుడు పాత భాస్కర్ తన కుమార్తె వాసవి జన్మదినాన్ని పురస్కరించుకొని, పాఠశాల అభివృద్ధికి అవసరమైన, విలువైన సామగ్రి సంగీత వాయిద్యాలు, వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్(Water purifier fridge), సింకుల బహుకరణతో పాటు విద్యార్థులందరికీ ఎగ్జామ్ ప్యాడ్లను బహూకరించారు.
ఈ సందర్భంగా పాఠశాలకు సంగీత విద్య మరింత విస్తరించాలనే ఉద్దేశంతో వివిధ సంగీత వాయిద్యాలను అందజేశారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, శుద్ధమైన తాగునీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా సింకులను కూడా బహూకరించారు.
అంతేకాకుండా పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఎగ్జామ్ ప్యాడ్లను పాఠశాలలోని ప్రతి విద్యార్థికి పంపిణీ చేశారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయడంతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. పాఠశాల(School)కు ఉపయోగపడే విలువైన వస్తువులను అందజేసినందుకు పాఠశాల అధ్యక్షుడు పాత భాస్కర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పాఠశాల ప్రిన్సిపల్ పూదరి సత్యనారాయణ, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సన్మానించారు.

