పోక్సో కేసులో పాఠ‌శాల అటెండ‌ర్ అరెస్టు

పోక్సో కేసులో పాఠ‌శాల అటెండ‌ర్ అరెస్టు

కరీంనగర్ క్రైమ్, ఆంధ్ర‌ప్ర‌భ : మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడుతున్ ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం అన్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా గంగాధర మండలం కుర్త్యాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహమ్మద్ మోయినుద్దీన్ అటెండర్ లైంగిక దాడికి పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించి, ఈ రోజు కరీంనగర్ రేకుర్తి చౌరస్తా వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు.

పాఠశాల సెలబ్రేషన్ రోజున విద్యార్థినులతో ఫోటోలు దిగి, వాటిని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడని ఫిర్యాదులు అందగా జిల్లా చైల్డ్ అండ్ మహిళ వెల్ఫేర్ అధికారి (Child and Women Welfare Officer), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మండల విద్యాధికారి మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి పాఠశాలను సందర్శించి బాధిత విద్యార్థినుల నుండి సమగ్ర వివరాలు సేకరించారని తెలిపారు.

ఫిర్యాదులో పేర్కొన్న అభియోగాలు నిజమేనని అధికారుల కమిటీలో తేలింద‌ని సోమవారం సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు సీఐ ప్రదీప్ ఆధ్వర్యంలో ఎస్సై వంశీకృష్ణ బి ఎన్ ఎస్. పోక్పో కేసు నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ విచారణ చేపట్టి నిందితుడు విద్యార్థినులపై లైంగిక దాడి కి పాల్పడిన‌ట్లు రుజువైంద‌ని వెల్ల‌డించిన‌ట్లు కమిషనర్ తెలిపారు.

Leave a Reply