School | పిల్లల చేతిలో ఫోన్ ఉండకూడదు..

School | పిల్లల చేతిలో ఫోన్ ఉండకూడదు..

School | పాయకాపురం, ఆంధ్ర ప్రభ : పాఠశాలలో విద్య ఒత్తిడి లేని చదువులు కలిగి ఉండాలని దేశ వ్యాప్తంగా 16 సంవత్సరాల పిల్లలకు ఫోన్ వాడే సౌకర్యం కలగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామకృష్ణ మిషన్ బేలూరు వైస్ ప్రెసిడెంట్ సుహితానందజీ మహారాజ్ స్పష్టం చేశారు. అజిత్ సింగ్ నగర్ వివేకానంద సెంటినరీ పాఠశాలలో పశ్చిమ బెంగాల్ రాష్టం కలకత్తా మహా నగరంలోని రామకృష్ణ మఠం మిషన్ బేలూరు వైస్ ప్రెసిడెంట్ స్వామి సుహితానందజీ మహారాజ్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు.

విద్య ఒత్తిడి లేని చదువు ఉండాలని రామకృష్ణ వివేకానంద శారదా మాత సాహిత్యాన్ని చదివినట్లయితే.. ఇట్టే తెలుస్తుందని అన్నారు. రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి కదా వీటిని ఎలా ఆచరించాలి? అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు చాలా ఓపికతో డూ గుడ్ బి గుడ్ అని వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని వివేకానందుని సాహిత్యం, రామకృష్ణ పరమహంస వివేకానంద సాహిత్యం చదవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వినిచలానంద మహారాజ్, శితి కంఠా నంద్ జి మహారాజ్, సేవాత్మానంద మహారాజ్, చంద్రకాంత్ మహారాజ్, అమోహ చైతన్య మహారాజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ఎస్ఎన్ మూర్తి, అప్పలరాజు, త్రిమూర్తి రాజు, హరిత మాధవి లత పాల్గొన్నారు.

Leave a Reply