ఘనంగా వీడ్కోలు సంబరాలు

ఘనంగా వీడ్కోలు సంబరాలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఐదేళ్లు ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థులు తాము ఐదేళ్ల అనుబంధాన్ని. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఉన్న బంధాన్ని గుర్తుతెచ్చుకొని భావోద్వేగానికి లోనయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ… కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు.

ప్రతి విద్యార్థి పరీక్షలల్లో అత్యున్నత మార్కులు సాధించి పాఠశాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకరవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి.

Leave a Reply