ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తులు…

ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తులు…
వెల్దుర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన వెల్దుర్తి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2026. 27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరబడుతున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ గంగ భవాని సోమవారం తెలిపారు.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గంగ భవాని మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు..
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మీసేవ కేంద్రం ద్వారా సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థి విద్యార్థి ఆధార్ కార్డు. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు. విద్యార్థి యొక్క పాస్ ఫోటో. బియ్యం కార్డు. కుల ధ్రువీకరణ. ఆదాయ ధ్రువీకరణ పత్రములు విద్యార్థి వెంట తీసుకొని వెళ్లి ఆన్లైన్లో చేయించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ గంగ భవాని కోరారు.
