మహిళల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి

మహిళల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని వికాస్ హైస్కూల్,లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఝాన్సీ రెడ్డి మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు.

ఆయా పాఠశాల కరస్పాండెంట్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్ ల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరుని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

అధికారం చేపట్టిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు.మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువచ్చామని తెలిపారు.

స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యత, అమ్మ పాఠశాలలు పనులు సైతం మహిళా సంఘాలకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, మహిళలు సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ వార్డు కౌన్సిలర్ ముద్ధసాని సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, ఆయా పాఠశాలల డైరెక్టర్లు రేగురి వెంకన్న, కె.వి.రెడ్డి, ఎర్ర సంపత్, పాఠశాలల ప్రిన్సిపల్ లు నాగేశ్వర్, నాగరాజు, వేణుమాధవ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply