Schemes| అభివృద్ధి చేస్తా…
Schemes| కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోల తేజస్విని శ్రీనివాస్ ఒక్కసారి అవకాశం కల్పిస్తే సారంగాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడప గడపకు కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేస్తూ తన గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తేజస్విని శ్రీనివాస్ గ్రామ ఓటర్లు అడుగడుగునా నీరాజనం పలుకుతూ విజయం నీదేనంటూ దీవెనలు ఇస్తున్నారు.

