scheme | మోసం జ‌ర‌గ‌క ముందే మేల్కొనండి!

scheme | మోసం జ‌ర‌గ‌క ముందే మేల్కొనండి!

  • స్కీమ్‌ల పేరుతో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతున్న ఏజెంట్లు

scheme | భీమ్‌గ‌ల్ టౌన్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌జ‌ల‌కు అత్యాశ క‌ల్పించ‌డం… ఆ త‌ర్వాత మోసం చేయ‌డం ప‌రిపాటి అయిపోయింది! ఇలాంటి సంస్థ‌ల‌పై ముందుగానే అధికారులు, పోలీసులు మేల్కొంటే మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వేలు పెడితే లక్షలు వ‌స్తాయంటూ బ్రోచర్లతో కొంద‌రు మార్కెట్ లోకి వస్తున్నారు. సామాన్యుల అత్యాశ‌ వీరికి వరంలా మారుతుంది. గతంలో నెలకు వెయ్యి, రెండు వేలు కట్టండి లక్షల విలువైన బహుమతులు గెలుచుకోండి అంటూ మార్కెట్ లోకి వచ్చిన వారిపై పోలీసులు కోరడా ఝుళిపించడంతో కొద్ది కాలం పాటు సద్దుమణిగారు. ప్రజలు అప్పట్లో వీరు చేసిన మోసాలు మరిచిపోక ముందే ఇప్పుడు మార్కెట్ లోకి మ‌ళ్లీ వ‌స్తున్నారు. ఇండ్లు, ఓపెన్ ప్లాట్స్, వ్యవసాయ భూములు గెలుపొండండి అంటూ ఆకర్షణీయమైన కరపత్రాలలో ప్ర‌చారం చేస్తున్నారు.

scheme | నాలుగు వేల‌కే ప్లాట్‌.. రూ.2500లకే ఇల్లు

scheme

నాలుగు వేల‌కే ప్లాట్‌.. రూ.2500లకే ఇల్లు అంటే ఎవ‌రైనా ఆక‌ర్షణీయ‌మ‌వుతారు. అదే బ్రోచ‌ర్‌తో ప్ర‌చారం ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొందరు స్కీం పేరిట ప్రజలను మోసం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేవలం నాలుగు వేలు చెల్లించండి ఇర‌వై గజాల ఇంటి స్థలాలు 20 గెలుపొందడంతోపాటు ఆకర్షణీయమైన బహుమతులు గెలుపొండండి అంటూ కరపత్రాలు ముద్రించి మార్కెట్ లో ప్రజల ను మోసం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇలా ఒక్కొక్కరు రూ నాలుగు వేలు చొప్పున ఐదు వేల మంది నుండి వసూళ్లకు పాల్పడుతున్నార‌ని తెలిసింది. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయం వద్ద కేవలం రూ.2500 లకే జీ ప్లస్ ఇంటిని గెలుపొందంది అంటూ మరో ముఠా నిజామాబాదు జిల్లా లో సైతం వసూళ్ల కు పాల్పడుతున్నారు.

scheme | ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు

ప్రజలను నమ్మించేందుకు ఏజెంట్ల‌ను రంగంలోకి దించింది ఆ సంస్థ‌. ఏజెంట్లుగా మారిన మోసగాళ్లు కొత్త స్కీం లలో చేరిన వారు కట్టిన డబ్బులకు భరోసా ఇస్తున్నారు. మోసం చేస్తే బాధ్యత త‌మ‌దేనని చెప్పి స్కీంలలో చేర్పిస్తున్నారు. ఇలా సభ్యత్వం చేయించే వారిలో కొందరు ఉద్యోగులు సైతం ఉండడం గమనార్హం.

scheme | అనుమతి లేకుండా స్కీం లు చేస్తే కేసులు నమోదు : సీఐ

scheme

ప్రైజ్ మనీ సర్క్యూలేషన్, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా స్కీం లు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామ‌ని సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ అన్నారు. స్కీం నిర్వాహకులు ఎంతటి వారైనా కేసులు నమోదు చేయడం జ‌రుగుతుంద‌న్నారు. ఇలాంటి మోసపూరిత స్కీంలలో చేరకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామ‌ని చెప్పారు. ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు న‌మోదు చేసి బాధితులకు న్యాయం చేస్తామ‌ని చెప్పారు.

Leave a Reply