డా. బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు

డా. బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు Babu Jagjivan Ram 119వ జయంతి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ A. Shyam Prasad, మాజీ మంత్రి Palle Raghunatha Reddy తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్ రామ్ దేశ సామాజిక న్యాయం, సమానత్వ సాధనలో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, సాధికారత అధికారి మోహన్ రామ్, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ–ఎస్టీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply