save nature | ప్రకృతి-వికృతి

save nature | ప్రకృతి-వికృతి

“ఓం ప్రకృత్యై నమః”.

సిరుల తల్లి అయిన శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శత నామావళిలోని మొదటి పేరే ప్రకృతి. ఆ జగన్మాత ప్రకృతి స్వరూపిణియై విశ్వమంతటా వ్యాపించి ఉంది. ప్రకృతి అంటే సహ జసిద్ధంగా ఉద్భవించిందని అర్థం. ప్రకృతిలో నదులు, సముద్రాలు, వాగులు, వంకలు, జలపాతాలవంటి జలభాగము, కొండలు, కోనలు, లోయలు, అడవుల వంటి భూభాగము, ఆకాశము, వాయువు, సూర్య, చంద్ర, నక్షత్రాల వంటి ఘన భాగము ప్రధాన విభాగాలై ఉన్నాయి. ఇవి సౌందర్యానికి, ఆరోగ్యానికి, ఆహ్లాద వాతావరణానికి నెలవులై ఉన్నాయి. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము అనే పంచ భూతాల సమాహారమే ప్రకృతి. ఈ పంచభూతాలనే ‘ఫైవ్ ఎలిమెంట్స్’ అని పాశ్చాత్యులంటారు.

ప్రకృతిమాత ఒడిలో క్రమంగా విభిన్నమైన ప్రాణకోటి జన్మించింది. ప్రకృతి నుండి పుష్కలంగా ప్రాణ
వాయువును, అమృత తుల్యమైన నీటిని, కాయలు, దుంపలు, పండ్లు వంటి ఆహారాన్ని స్వీక రిస్తూ తమ జాతిని పెంపొందించుకొంది. చివరకు ప్రకృతిలోనే లీనమవుతూ సృష్టి, స్థితి, లయకారిణి యైన ప్రకృతి మాత లీలావిభూతిని అనుభవిస్తోంది. ప్రకృతి, పురుషుల సమ్మేళనమే ఈ ప్రపంచం. ఇక్కడ ‘పురుష’ అనే పదాన్ని మగవాడనే సంకుచితార్థంలో కాకుండా సకల ప్రాణికోటికీ సంకేతంగా గ్రహించా లి. ప్రాణులన్నింటిలోనూ బుద్ధిజీవిగా రూపొందిన మానవుడు నెమ్మది నెమ్మదిగా ప్రకృతిమీద, తక్కిన ప్రాణులపైనా ఆధిపత్యం చెలాయించడం మొదలెట్టాడు.

save nature |
save nature |

save nature | సకల ప్రపంచానికీ ముప్పుగా

కాలం గడిచే కొద్దీ మానవునిలో స్వార్థం ప్రబ లుతూ, కల్పవృక్షంలాంటి ప్రకృతిని సంరక్షించడం తన కర్తవ్యమనీ, అందులోనే తన అభివృద్ధి ఉందనీ మరచిపోయి తన ఇష్టం వచ్చినట్లుగా ప్రకృతిని వాడుకొనే ప్రయత్నాలు ప్రారంభించాడు. దాని సహజ రూపంలో ఉంటేనే అది ప్రకృతి. అసహజ మైన రూపాన్ని దానికి అంటగడితే అది వికృతిగా మారి సకల ప్రపంచానికీ ముప్పుగా పరిణమిస్తుందని మనిషి గ్రహించలేకపోతున్నాడు.
లోకానికి అత్యంత అవసరమైన ప్రాణవాయు వును, వర్షాలను, వివిధ రోగాలను నయంచేసే ఔషధ మూలికలను, కాయ, దుంప, పండ్లను, కలపను ప్రసాదించే అడవులను, అందులోని పచ్చని చెట్లను నరికివేసి తనకు నివాస భూములు గా మార్చుకొన్న ఫలితంగా కలుషిత వాతావరణం, అనావృష్టి, అతివృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలను అనుభవిస్తున్నాడు. తమకు నివాసప్రాంతం కరవై క్రూర మృగాలు జనావాసాలపై దండెత్తే పరిస్థితి కొనితెచ్చుకొన్నాడు మనిషి. నదులు, వాగులు, వంకలు ప్రవహిం చే ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ బహుళ అంతస్థుల భవనాలను, కర్మాగారా లను నిర్మించుకొంటున్న ఫలితంగా వర్షా కాలంలో ఆ ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

save nature | వాన నీరు భూమిలోకి ఇంకక

నదుల ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టలు నిర్మించి నదీ జలాలను భారీ ఎత్తున ఒక “చోట నిల్వజేయడం వలన ఆ పరిసర ప్రాంత భూములపై ఒత్తిడి తీవ్రమై తరచుగా భూకంపాలు సంభవించి, ఆనకట్టలు, వంతెనలు ధ్వంసమై అపార జననష్టానికి, ఆస్తి నష్టానికి కారణమౌతున్నాయి. మట్టి నేలలను సిమెంట్ రోడ్డులుగా మార్చడం వలన వాన నీరు భూమిలోకి ఇంకక, భూగర్భ జలాల కొరత తీవ్రమౌతోంది. సైన్స్, నాగరికతల ముసుగులో తక్షణ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం, శాశ్వతమైన ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తోంది.

save nature | మన మొదటి కర్తవ్యం

జగన్మాతవలె ప్రకృతి మాత కూడా ఎంత శాంత మూర్తియో, అంత రౌద్రమూర్తి కూడా. తన పట్ల, సకల జీవరాశిపట్ల ప్రేమతో, దయతో వ్యవహ రిస్తే అక్షయమైన, అనంతమైన సుఖ సంపదలను ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగే ప్రకృతి జోలికి దుర్మార్గంగా వస్తే రౌద్రరూపం దాల్చి విలయాలు సృష్టించ గలదు. ప్రకృతిని సంరక్షించడం మన మొదటి కర్తవ్యం. అందుకే మన శాస్త్రాలు పచ్చని చెట్లను కొట్టకూడదనీ, అది మహా పాపమనీ, ఒకవేళ తప్పని పరిస్థితులలో అలా చేయాల్సి వస్తే అందుకు ప్రాయశ్చిత్తంగా అనువైన మరొక ప్రదేశంలో తాను కొట్టిన చెట్లకు పదిరెట్ల సంఖ్యలో మొక్కలను నాటి సంరక్షించాలనీ చెబుతున్నాయి.

రామరాజ్యంలో చెట్లకు గాయాలుండవని చెప్పారు ఆదికవి వాల్మీకి తమ రామాయణ కావ్యంలో. అంటే ఆనాటి ప్రజలెవ్వ రూ చెట్లకు హానిచేసేవారు కాదన్నమాట. అందుకే అప్పుడు నెలకు మూడు వానలు కురిసి, బంగారు పంటలు పండి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అలాగే నదులను పుణ్యతీర్థాలుగా భావించా లనీ, అందులో ఉమ్మివేయడం, మలమూత్ర విసర్జన చేయడం చెత్తను, మురుగు నీరును కలపడం మహా పాపమనికూడా శాస్త్రాలు చెబుతున్నాయి.

save nature | ప్రకృతి పట్ల ప్రేమతో

ఆమంచి మాటలను పెడ చెవినపెట్టి, నదులనూ, వాతావర ణాన్నీ కలుషితం చేయడం మూలంగా ఎన్నో అనా రోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నాం మనం. ప్రకృతి పట్ల ప్రేమతో ప్రవర్తించే వారిని ఆ భగవంతుడు రక్షిస్తాడు.

“జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః
అటవ్యాం నారసింహశ్చ
సర్వతః పా తు కేశవః”.

నీటిలో వరాహస్వామిగా, భూమిపై వామనమూర్తిగా, అడవులలో నరసింహ స్వామిగా, ఇలా సర్వత్రా ఏ ఆపదలూ రానీకుండా మనలను కాపాడుతాడు. కనుక ప్రకృతిని, పర్యావరణాన్ని, సంరక్షిద్దాం. మనకు మనమే మేలు చేసుకొందాం.

-డా.గొల్లాపిన్ని సీతారామశాస్త్రి

click here for more

click here to read Meanings of 15| వీటి పరమార్థమేమిటో తెలుసా..?

Leave a Reply