Satyam Lakshmi Kumari | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam Lakshmi Kumari | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ కుమారి
Satyam Lakshmi Kumari | అశ్వరావుపేట, ఆంధ్రప్రభ : ఈనెల 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో మండలంలోని ఊట్లపల్లి గ్రామపంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యం లక్ష్మీ కుమారి గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు, తన భర్త సత్యం రామకృష్ణకు పరిచయాలతో గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తామని, సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని ఆమె తెలిపారు.తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఐదు సంవత్సరాలలో ఊట్లపల్లి గ్రామపంచాయతీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తానని ఓటర్లకు ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
