AP | విక‌సించిన విద్యా కుసుమం..

టీడీపీ ప్రభుత్వం 2014–19 మధ్య అమలు చేసిన విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొందిన సాత్విక్ మురారి అనే యువకుడు ఇప్పుడు ఇతర పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ పథకం ద్వారా ఐర్లాండ్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న సాత్విక్, అక్కడే స్థిరపడి వ్యాపారిగా ఎదిగాడు.

తాజాగా సాత్విక్ మురారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలసి తన లాంటి ప్రతిభావంతులైన కానీ ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నట్టు ప్రకటించాడు. విదేశీ విద్యను ఆర్థికంగా సాధించలేని పేద విద్యార్థులకు తన వంతు సాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చాడు.

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా ఎందరో విద్యార్థులు లబ్ధి పొందారని, తాను కూడా అందులో భాగమని సాత్విక్ మురారి పేర్కొన్నాడు. ఇదే బాటలో మరింత‌మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో సాత్విక్ ముందుకు రావడం అభినందనీయమని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

Leave a Reply