హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills Bypoll) త‌మ పార్టీ సత్తా చాటాలని ఆ నియోజకవర్గంలోని కేడర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో వెంగళరావు నగర్ సిగ్మంట్‌కు చెందిన పార్టీ కేడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లతో ముచ్చట పెట్టి అమలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను వారికి గుర్తు చేయాలని సూచించారు.

కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి…


బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం ఓటర్లకు వివరించాలని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. గతంలో పీజేఆర్, కేసీఆర్, గోపినాథ్ కొట్లాడినట్లు ఉప ఎన్నికల్లో కొట్లాడాలంటూ బీఆర్ఎస్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. భయపడితే నాయకులు కాలేరని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఎన్నో కేసులు పెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ దుష్ప్ర‌చారం…


కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ పార్టీ (Congress party) దుష్ప్ర‌చారం చేస్తోందని, అందుకు తాను భయపడడం లేదని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మీ ఇళ్లు కూల్చడానికి మీరే లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు. హైడ్రా పేరు మీద సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వేల ఇళ్లు కూలగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా పని చేయటమే ఇందిరమ్మ రాజ్యమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ ప‌రిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాద‌ని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) రాక ముందు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రూ.20వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) రూపంలో బకాయిలు పెడితే.. తాము అధికారంలోకి వచ్చి క్లియర్ చేశామని అన్నారు. కానీ, రేవంత్ సర్కార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క చెప్పడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు.

Leave a Reply