రైల్వే జీఎంకు కృతజ్ఞతలు : ఎంపీ చామల
యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్-విజయవాడ (Secunderabad Vijayawada) శాతవాహన ఎక్స్‌ప్రెస్ (Train Nos. 12713/12714) జనగాం రైల్వే స్టేషన్‌లో స్టాప్ మంజూరు చేశారని, ఇక నుంచి జనగామ రైల్వేస్టేషన్ల లో ఆ ఎక్స్‌ప్రెస్ ఆగతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నుంచి జనగామలో ఆగుతుందని చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు స్టాప్ ఏర్పాటు చేశారని తెలిపారు.

